జగదేవపూర్ మండల కేంద్రంలో 14 వార్డు నభినగర్ లో బీరప్ప బోనాలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు బోనమెత్తి ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపులో డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువకుల కేరింతలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కి, శ్రీ పొచ్చమ్మ తల్లి, కురుమ కుల దైవం బీరప్ప స్వామికి భక్తి శ్రద్ధలతో భక్తులు, ప్రజాప్రతినిధులు పూజలు నిర్వహించారు. కోరిన కోర్కెలు తీర్చాలని మొక్కులు సమర్పించుకున్నారు. కార్యక్రమంలో కురుమ కుల బాంధవ్యులు, స్థానిక నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
