ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే30, దుబ్బాక నుండి కొండాపూర్ మీదుగా వేములవాడ వెళ్లే బస్సు వివిధ కారణాలవల్ల నిలిపివేయడం జరిగింది. ఆ బస్సును మళ్లీ దుబ్బాక నుండి కొండాపూర్ మీదుగా వేములవాడ పున ప్రారంభించాలని దుబ్బాక డిపో ఇంచార్జ్ మేనేజర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు. ఈకార్యక్రమంలో మార‌్వాడి గంగరాజు, పెండ్యాల నారాయణ రెడ్డి, ఐనేని అంజి రెడ్డి, వంగమోహన్ రెడ్డి, క్యారం రాజు, కనమేని శ్రీనివాస్ రెడ్డి, కమ్మరి శ్రీనివాస్, రాజేశం, వెంకట కిషన్, సాకలి రాజు పాల్గొన్నారు.




