ప్రాంతీయం

మానేరు వాగు మధ్యలో చిక్కుకున్న ఇద్దరు రైతులను కాపాడిన జిల్లా డి ఆర్ ఎఫ్ టీమ్

117 Views

గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలోని మానేరు వాగులో చిక్కుకున్న ఇద్దరు రైతులను కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించిన జిల్లా పోలీస్ డి ఆర్ ఎఫ్ టీమ్(డి ఐ ఎస్ ఏ ఎస్ టి ఈ ఆర్, రెస్పాన్స్ ఫోర్స్ ),గంభీరావుపేట పోలీసులు,ఫైర్,ఫిషరి డిపార్ట్మెంట్,*
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడీ పెట్ గ్రామంలో ఇద్దరు రైతులు అల్లాడి రాజాం,మెతుకు ఎల్లయ్య లు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లగా జిల్లాలో గత నాలుగు రోజులుగా పడుతున్న భారీ వర్షాల వల్ల మానేరు వాగు ఉదృతంగా ప్రవహించడంతో వాగు మధ్యలో నాలుగు రోజులుగా చిక్కుకొని ఉన్నారన్న సమాచారం మేరకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్., గారి ఆదేశాల మేరకు గంభీరావుపేట ఎస్.ఐ మహేష్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా పోలీస్ డి ఆర్ ఎఫ్ టీమ్, ఫిషరిస్, ఫైర్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇద్దరు రైతులను కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగిందని ఎస్.ఐ మహేష్ తెలిపారు..
ఈ రెస్క్యూ ఆపరేషన్ లో డి ఆర్ ఎఫ్ టీమ్ సభ్యులు, ఫిషరిస్,ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *