మంచిర్యాల జిల్లా.
పట్టాల పేరుతో కాంగ్రెస్ మరియు BRS పేద ప్రజలను మోసం చేశాయి – బీజేపీ నాయకులు రఘునాథ్ వెరబెల్లి.
నస్పూర్ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బిజెపి ఆధ్వర్యంలో బాధిత ప్రజల తో కలిసి అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, రఘునాథ్ వెరబెల్లి మరియు బిజెపి నాయకులు ధర్నా నిర్వహించడం జరిగింది. ఎన్నో ఏండ్లుగా నివాసం ఉంటు ఇంటి పన్నుల కడుతున్న పేద ప్రజలకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని రఘునాథ్ గారు డిమాండ్ చేశారు . గతంలో BRS ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇండ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి పట్టాలు ఇవ్వకుండా పేద ప్రజలని మోసం చేస్తున్నాయి అని రఘునాథ్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సత్రం రమేష్, పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణ మూర్తి, మిట్టపల్లి మొగిలి, పొన్నవేణి సదానందం, కమలాకర్ రావు, సామరాజ్ రమేష్, రావణవేణి శ్రీనివాస్, కుర్రే చక్రి, మద్ది సుమన్, చెల్లా విక్రమ్, ఆకుల నరేందర్, బద్రి శ్రీకాంత్, కట్కూరి తిరుపతి, మల్కా రాజేశం, బొలిశెట్టి అశ్విన్, రమణ రావు, అమిరిశెట్టి రాజ్ కుమార్, గడ్డం స్వామి రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
