ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్ 6, కృష్ణాష్టమివేడుకలను బుధవారం వైభవంగా నిర్వహించారు. బంధనకల్ గ్రామంలోని శ్రీవాస్ దేవాశ్రమం ఆలయంలో రేపాక రామశర్మ, రేపాక రాజుశర్మ, శాస్త్రుల శ్రీచరణ్ శర్మ, పురాణం హరిప్రసాద్ శర్మ అర్చకులచే ఉదయాన్నే స్వామివారిని ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు, నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. ముఖ్యంగా ఆలయం ఆవరణలో ముగ్గులు పలువురిని అలరించాయి. సాయంకాలాన భక్తులు ఉత్సాహంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.




