ప్రాంతీయం

దొడ్డి కొమురయ్య కురుమ ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవం కార్యక్రమo

55 Views

మంచిర్యాల జిల్లా.

నేడు హైదరాబాద్ లోని కోకాపేటలో నూతనంగా నిర్మించిన దొడ్డి కొమురయ్య కురుమ ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవం కార్యక్రమానికి మంచిర్యాల జిల్లా కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు గుంట శ్రీశైలం ఆధ్వర్యంలో బయలుదేరిన మంచిర్యాల జిల్లా కురుమ సంఘ సభ్యులు. జెండాను ఊపి కాన్వాయ్ ను ప్రారంభించిన మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ కురుమ, మంచిర్యాల జిల్లా కురుమ సంఘము అధ్యక్షులు గుంట శ్రీశైలం కురుమ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏనుగుల బీరాయ్య, జిల్లా నాయకులు మండల నాయకులు, కురుమ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్