తెలంగాణ ముస్లిం ఏక్తా కమ్యూనిటీ యూత్ & సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ అధ్యక్షులు షేక్ ముజాహిద్ సొసైటీ సభ్యులు అందరూ కలిసి శ్రీ హబీబ్ జిలాని తెలంగాణ ముస్లిం ఏక్తా అధ్యక్షులుగా మున్సిపాల్ చైర్మన్ సమక్షంలో పూలమాలవేసి శాలువాతో సన్మానం చేసి సొసైటీలో ఆహ్వానించడం జరిగింది. హాబీబ్ జిలాని మాట్లాడుతూ… ఈ సొసైటీలో అధ్యక్షులుగా నన్ను స్వీకరించినందుకు సొసైటీ అధ్యక్షులు షేక్ ముజాహిద్ కి సొసైటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సొసైటీలో ఎందుకు రావడం జరిగిందంటే నేను సొసైటీ యొక్క సేవ కార్యక్రమాలు ఎన్నో చూసాను దానికి ముద్దులై ఈ సొసైటీలో చేరడం జరిగింది. నేను ఎన్నో సొసైటీ సేవలు చూసాను కానీ ఈ సొసైటీ చేస్తున్న సేవా కార్యక్రమాలు రక్తదానం, గాని కరుణా సమయంలో చేసిన సేవలు గాని, మరియు పేద ప్రజలకు రేషన్ కిట్లు గానీ, ప్రభుత్వ ఆసుపత్రులలో నెలకొకసారి ఫ్రూట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం గానీ, ఎన్నో కార్యక్రమాలు చేసినందుకు ఈ సొసైటీలో నాకు ఒక మంచి స్థానాన్ని ఇచ్చినందుకు సొసైటీ అధ్యక్షులు షేక్ ముజాహిద్ కి మరియు సభ్యులందరికీ ఎంతో రుణపడి ఉంటానని చెప్పడం జరిగింది. మరియు నా తరఫునుంచి కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని మాట ఇస్తున్నాను. ఇలానే మనమందరం కలిసి పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి సొసైటీని ఇంకా ముందుకు నడిపించి ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను. మరియు నిర్మల్ ముస్లిం సహోదరులకు అన్ని విధాలుగా సేవలు అందిస్తానని ముస్లిం నిర్మల్ ప్రజలకు తెలియజేస్తున్నాను. ముందుగా నిర్మల్ ముస్లిం ప్రజలు ఒకటి ఐతేనే మనం ఆర్థికంగా గాని, రాజకీయంగా గాని, ముందుకు వెళ్తామని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలోయూసుఫ్ నీర్మలి , సీనియర్ విలేకరి వసీం షకిల్ , మాజీ జామా మజీద్ కమిటీ అధ్యక్షులు అజర్ , అడ్వకేట్ ఖ య్యుం., కౌన్సిలర్లు మతిన్ , సలీం , రఫీ , కౌన్సిలర్ రమణ, నరహరి ,మాజహర్ , అయ్యుబ్ ,సొసైటీ ప్రధాన కార్యదర్శి అల్మాస్ ఖాన్ , ఉపాధ్యక్షులు సాజిద్ , అమన్ జాయింట్ సెక్రటరీ జుబెర్, సొసైటీ సభ్యులు, మోయ్స్
, కలీమ్, అర్బాజ్, ఆశ్లం, ఆఫ్రోస్ , తదితర సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.




