నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలి…
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి….
…. సిపిఐఎం మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో…
సెప్టెంబర్ 6 చేర్యాల: బిజెపి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల పైన మోయలేని భారాలు మోపుతున్న దాన్ని వెంటనే తగ్గించాలని సి పి ఐ ఎం మండల కార్యదర్శి కొంగరి వెంకట మావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేర్యాల మండల తహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఐఎం మండల కమిటీ, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రోజున ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన మెమోరండాన్ని తాసిల్దార్ రాజేశ్వరరావు కి అందించారు. అనంతరం కొంగరి వెంకట మావో ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాసంక్షేమాన్ని మరిచి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని కేంద్రంలో నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటు బడా కార్పొరేటు గుత్తాధిపతులకు ధారాధత్వం చేస్తూ ప్రజల మీద విపరీతమైన భారాలు మోపుతున్నారని దేశ సంపదనంతా ఆదాని అంబానీ టాటా బిర్లా లాంటి కోటీశ్వరులకు చేరే విధంగా ప్రజా వ్యతిరేక విధానాలను రూపొందిస్తూ ప్రజాసంక్షేమం కోసం ఉపయోగపడే సేవా రంగాలైన విద్యా వైద్యము విద్యుత్తు ఇంకా ఇతర రంగాలన్నింటినీ ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం చేస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు విద్యా వైద్యాన్ని దూరం చేస్తున్నారని పేదలు మధ్యతరగతి కుటుంబీకులు కార్మికులు రైతులు ఈ మోడీ ప్రభుత్వ విధానాల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని నిత్యవసర వస్తువుల ధరలు పెంచి జిఎస్టి పేరుతో ప్రభుత్వ ఖజానా నింపుకుంటూ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని ఈ ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే మానుకోవాలని నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని ప్రజా పంపిణీ వ్యవస్థ ను పటిష్ట పరిచి 14 రకాల నిత్యవసర సరుకులను పేదలకు సబ్సిడీ ధరలపై పంపిణీ చేయాలని నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని కార్మికుల కు కనీస వేతనాలను రైతులు పండించే పంటలకు మద్దతు ధరను ప్రకటించి అమలు చేయాలని ఈ డిమాండ్ల ను వెంటనే పరిష్కరించాలని దేశంలో మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ ప్రాంతాల మధ్యన హిందూ, ముస్లిం, క్రైస్తవులు, గిరిజనులు, దళితుల మధ్యన మధ్యన చిచ్చులు లేపి రాజకీయ పదం గడుపుకుంటుందని దీన్ని ఆసరా చేసుకుని దేశంలో ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతూ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ రాబోయే రోజుల్లో మనువాదాన్ని దేశంలో అమలు చేయాలని చూస్తున్నారని దీన్ని వ్యతిరేకిస్తున్న ప్రజాతంత్ర వాదుల మేధావులపై అక్రమ కేసులు దేశద్రోహం కేసులు పెట్టి జైలకు పంపే విధంగా కుట్రలు పన్నుతున్నారని దాడులు నిర్వహిస్తున్నారని ఈ చర్యలను వెంటనే మానుకోవాలని రాబోయే రోజుల్లో బిజెపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పేద మధ్యతరగతి కార్మిక వర్గం రైతులను మేధావులను ప్రజాతంత్ర వాదులను ఏకం చేసి పోరాటాన్ని బలోపితం చేస్తామని సిపిఎం నిర్వహించే ఈ పోరాటంలో పార్టీలకతీతంగా భారతదేశ భవిష్యత్తు ను కార్పొరేట్లపరం కాకుండా కాపాడు కొనేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం చేర్యాల పట్టణ కార్యదర్శి రాల బండి నాగరాజు సిపిఎం నాయకులు ఆముదాల నర్సిరెడ్డి, పోలోజు శ్రీహరి, బోయిని మల్లేశం, గొర్రె శ్రీనివాస్, పొనుగోటి శ్రీనివాస్ రెడ్డి కాశెట్టి ఆంజనేయులు, ఎండి కరీం, పున్నమినా సిద్ధులు, ఆముదాల రంజిత్ రెడ్డి తొడంగల, రామచంద్రం, గుండ్రరవీందర్, చెట్కూరి భీమరాజు, బ్రహ్మయ్య,నారాయణ తదితరులు పాల్గొన్నారు.





