బెల్లంపల్లి మార్చి 28, 24/7 తెలుగు న్యూస్ :తాజ్ బాబా సేవ సమితి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు మినరల్ వాటర్ మరియు లెమన్ జ్యూస్ పంపిణీ…
బెల్లంపల్లి పట్టణ కేంద్రానికి చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులకు దాహాన్ని తీర్చుటకు తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో మిత్రుడు గరిగే వేణు తల్లి గరిగే జయమ్మ జ్ఞాపకార్థం తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.తనంతరం ఉస్మాన్ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు పరీక్షలు కష్టంతో కాకుండా ఇష్టపడి రాయాలని ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు తమ తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తాజ్ బాబా సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్మాన్,వినయ్,శీనులాల్ తదితరులు పాల్గొన్నారు