అర్హులైన జర్నలిస్టులకు గృహలక్ష్మీ
జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ఉద్యమ సమయంలో జర్నలిస్టుల పాత్ర కీలకం
వరదల సమయంలో జర్నలిస్టుల ఉత్తమ సేవలు
ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి రూ. 15 లక్షల మంజూరు
ప్రెస్ క్లబ్ భవన శంకుస్థాపనలో జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి
ఏటూరునాగారం,ఆగస్టు 04
అర్హులైన జర్నలిస్టులకు గృహలక్ష్మీ పథకంలో అవకాశం కల్పిస్తామని ములుగు జడ్పీ పర్సన్, ములుగు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు.సోమ వారం ఆమె ఏటూరునాగారం మండల కేంద్రంలో రూ. 15 లక్షలతో ప్రభుత్వం మంజూరి చేసిన ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి ఐటిడిఏ పిఓ అంకిత్ , బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, స్థానిక జర్నలిస్టులతో కలిసి ఆమె భూమి పూజ చేశారు.ఈ మేరకు ఆమె మాట్లాడుతూ మలి విడత తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనదని మొన్నటి మొన్న ములుగు జిల్లాలో కురిసిన భారీ వర్షాల మూ లంగా సంభవించిన వరదలలో సైతం సమాజానికి సమాచారం అందించడంలో జర్నలిస్టులు ఉత్తమ సేవలు అందించాలని, జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె అన్నారు.ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టే జన రంజక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వానికి సహాక రించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఏటూరునాగారం మండల అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్,ఎంపీపీ విజయ, రైతు బందు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, తుమ్మ మల్లారెడ్డి, ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, బాదం ప్రవీణ్, మహేష్, సాగర్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.