బండారి లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత ఆరోగ్య కార్డులు.
సెప్టెంబర్ 4,
ఉప్పల్ శాసనసభ బారాస అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరోగ్య సేవా కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా నేడు నాచారం డివిజన్ ఎర్రకుంట లో స్థానిక కార్పొరేటర్ శాంతి తో కలిసి ప్రారంభించారు. ప్రతి సంవత్సరానికి కుటుంబం మొత్తానికి ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం.1800జబ్బులకు పైగా ఐదు లక్షల వరకు కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం. ప్రతి కుటుంబానికి ప్రతి కుటుంబ సభ్యులకి వేరువేరు కార్డులు ఇవ్వడం జరుగుతుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ పథకానికి అర్హులు ఆరోగ్య మిత్రులు ఇంటింటికి తిరిగి ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు బండారి లక్ష్మన్న సేవలను వినియోగించుకోవాలని
అలాగే ఇదే కార్యక్రమంలో *కొత్త ఓటరు నమోదు ఉచితంగా చేయబడునని 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకోవాలని* కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయి జేన్ శేఖర్, బీఆర్ఎస్ నాచారం డివిజన్ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
