మంచిర్యాలలో కాంగ్రెస్ ను ఆదరించండి ప్రేమ్ సాగర్ రావు ను గెలిపించండి.
తెలంగాణ రాష్ట్ర ము ను ఇచ్చిoది కాంగ్రెస్.
కాంగ్రెస్ నాయకులు యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాహుల్ ప్రియాంక గాంధీ సేన రాష్ట్ర కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్.
కాంగ్రెస్ ను ఆదరించి ప్రేమ్ సాగర్ రావు భారీ మెజారిటీ తో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు, యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాహుల్ ప్రియాంక గాంధీ సేన రాష్ట్ర కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్ పిలుపు నీచ్చారు.
గురువారం హజిపుర్ మండలము ముల్కల్ల గ్రామం లో గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ 6 హామీలను ప్రజలకు వివరించి ఆయన మాట్లాడుతూ మంచిర్యాల శాసనసభ్యుడు దివాకర్ అసమర్థ పాలన, వల్ల నియోజవర్గం లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్నీ వర్గాల అభివృద్ది కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అవుతుంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లో కి రావడం ద్వారా నే రు.500 లకు గ్యాస్ సిలెండర్,మహిళకు ఉచిత బస్సు సౌకర్యం,200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్,రైతులకు అనేక పథకాలను అందుతాయన్నారు.మంచిర్యాల నియోజవర్గం లో ప్రేమ్ సాగర్ రావు ను ఆదరించాలనీ ప్రజలను కోరారు.ప్రేమ్ సాగర్ రావు అనేక సేవ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అండగ ఉంటున్నారని కొనియాడారు. ప్రజలు అందరూ ప్రేమ్ సాగర్ రావు గెలుపు లో భాగ స్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు నాయికినీ సురేందర్, మండల అధ్యక్షలు తోట రవి ,సందెల బాపు ,, మోటపలుకుల రమేష్, వినేష్, రవీందర్,మొగిలి , రాజయ్య, లచ్చన్న, బానేశ్, ఆవుల తిరుపతి, అకిరెడ్డి సత్యం తదితురులున్నారు.
