యూనిక్ కంపెనీ పేరుతో
జనానికి కుచ్చుటోపీ
3 కోట్లకు పైగా ఘరానా మోసం
బాధితుని ఇంటిని చుట్టుముట్టిన మహిళలు
పోలీస్ స్టేషన్ కు తరలిన బాధిత మహిళలు
ఎల్లారెడ్డిపేట మార్చి 02 :
ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన దీకొండ సునీల్ (33) అనే వ్యక్తి యూనిక్ కంపెనీ పేరుతో సుమారు రెండు వందల మంది కి సుమారు మూడు కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టినట్లు వెంకటాపురం గ్రామానికి చెందిన మహిళలు ఆరోపించారు,
ఈ మేరకు మహిళలు సునిల్ ఇంటిని శనివారం ఉదయం చుట్టుముట్టి యూనిక్ కంపెనీ పేరుతో తమ వద్ద నెలనెలా వసూలు చేసిన తమ పొదుపు డబ్బు లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు,
ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు సంఘటన స్థలానికి శనివారం వెళ్లి విచారించి సునీల్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు
యూనిక్ కంపెనీ పేరుతో తమ వద్ద సునీల్ నెలనెలా డబ్బులు పొదుపుచేయమన్నాడని ఊరోడని,,,,,తెలిసిన వాడిని,,,,, చేస్తే
46 నెలల తర్వాత యూనిక్ కంపెనీ తో డబుల్ ఇప్పిస్తామని చెప్పి 56 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ తమ పొదుపు డబ్బులు ఇప్పించడం లేదని బాధితులు లబోదిబోమంటున్నారు,
ఈ విషయం లో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న యూనిక్ కంపెనీ బ్రాంచ్ కు వెళ్లి అడుగుతే సునీల్ తో తమ కంపెనీ కీ ఏలాంటి సంబంధం లేదని ఎవరికి డబ్బులు చెల్లించారో వారినే అడగాలని అంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు,
దీంతో ఎల్లారెడ్డిపేట మండలంలోని పోతిరెడ్డిపల్లి ,అగ్రహారం ,వెంకటాపురం ,హరిదాస్ నగర్ ,పధిర ఎల్లారెడ్డిపేట మండలం లోని తదితర గ్రామాలకు చెందిన సుమారు రెండు వందల మంది మహిళలు శనివారం సునీల్ ఇంటికి వెళ్లి తమ డబ్బులు ఇప్పించాలని అడుగుతే ఏమి సమాధానం చెప్పడం లేదని తాము కూలీ నాలీ చేసుకొని కుటుంబాన్ని పోషించుకొని పొదుపు చేసుకున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు,
తమ పొదుపు డబ్బులను సునీల్ తన స్వంతానికి వాడుకొని కంపెనీ తో మాట్లాడి ఇప్పిస్తానని భూకాయిస్తూ కూలీ నాలీ చేసుకొని బతికే మా నిరుపేదల నోట్లో మట్టి కొట్టాలని చూస్తున్న సునీల్ నుంచి తమ పొడుపు డబ్బులను ఇప్పించాలని వారు జిల్లా పోలీస్ అధికారికి మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు,
సునీల్ వద్ద తమ పొదుపు డబ్బులు ఇప్పించాలని మహిళలు ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు వచ్చి ఎస్ ఐ రామాకాంత్ ను కోరగా విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు వెళ్ళిపోయారు,





