కొండ దంపతుల ఇంటికి సుమ శ్రీనివాస్ చౌదరి
గతంలో ఎల్లారెడ్డిపేట తాసిల్దార్ గా విధులు నిర్వహించిన సుమ శ్రీనివాస్ చౌదరి ఖమ్మం జిల్లా పంచాయతీ వెల్ఫేర్ ఆఫీసర్ గా నియమితులైన సందర్భంగా ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి కి చెందిన మాజీ ఏఎంసి చైర్మన్ కొండ రమేష్ దంపతుల ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా సుమకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా కొండ రమేష్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ గా ఉన్నప్పుడు విధులు సక్రమంగా నిర్వహించిందని పేర్కొన్నారు. ఆమెకు ఆహ్వానం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
