
మంగపేట,సెప్టెంబర్ 03
ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 02 నుంచి 9 వరకు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులు తమ వీలును బట్టి తమ కేసులను ఏ రోజైనా రాజీ కుదుర్చు కునేలా ప్రీ-లోక్ అదాలత్ ను ఏర్పాటు చేస్తున్నట్లు మంగపేట ఎస్ఐ రవి కుమార్ తెలిపారు. ఈ ప్రీ-లోక్ అదాలత్ లో రాజీ పడదగు క్రిమినల్,సివిల్ కేసులు,భూ తగాదాల కేసులు, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ కేసులు,వివాహ కుటుంబ త గాదా కేసులు,బ్యాంకు,చెక్ బౌన్స్,ఎలక్ట్రిసిటీ,చిట్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు,ఎక్సైజ్ కేసులు,విద్యుత్ చోరీ,కన్సూ మర్ ఫోరమ్ కేసులు,ట్రాఫిక్ ఈ-ఛాలన్ కేసులు ప్రీ- లిటిగే షన్ కేసులు ఇతర రాజీప డదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించ బడుతుందని కావున ఈ ప్రీ-జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరు అయ్యి,తమ తమ కేసులను వారికి వీలయిన రోజునే పరి ష్కరించుకునేలా అవకాశం కలిపిస్తుందని అన్నారు.




