Breaking News

నరేంద్ర మోడీ  నేత్రుత్వంలో 11 సంవత్సరాల సుపరిపాలన – బిజెపి

10 Views

మంచిర్యాల జిల్లా

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  నేత్రుత్వంలో 11 సంవత్సరాల సుపరిపాలన కార్యక్రమం.

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  నేత్రుత్వంలో 11 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన మంచిర్యాల బిజెపి జిల్లా కార్యాలయంలొ జరిగిన మీడియా సమావేశంలొ ముఖ్య అతిధిగా వెరబెల్లి రఘునాథ్ పాల్గొని దేశంలొ నరేంద్ర మోదీ నేత్రుత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు గూర్చి ప్రెస్ ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం నరేంద్ర మోదీ 11 సంవత్సరాల సూపరిపాలన సందర్బంగా జిల్లా కార్యాలయంలొ ఎగ్జిబిషన్ ప్రారంభం చేయడం జరిగింది. మీడియాని ఉద్దేశించి వెంకటేశ్వర్ గౌడ్ మరియు రఘునాథ్ మాట్లాడుతూ ప్రపంచ దృష్టి భారత దేశం వైపు ఆకర్శించే విధంగా ప్రధాని నరేద్ర మోదీ 11 సంవత్సరాల పరిపాలన జరిగింది అని అన్నారు. ఈరోజు జీ 20లొ భారత దేశం ప్రముఖ స్థానంలో గౌరవ అందుకునే స్థాయికి ఎదిగింది అని గుర్తు చేస్తు, ఆర్ధిక రంగంలో, సామజిక రంగంలో, రవాణ వ్యవస్థ, రైతులు, మహిళలు, ఈ విధానం అనేక విధాలుగా అన్ని రంగాల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని అన్నారు. నరేంద్ర మోదీ పాలనకు ముందు భారత దేశంలో కాంగ్రెస్ పాలనలో అవినీతి కూడిన పాలనా జరిగింది అని నరేంద్ర మోదీ పరిపానాలో ఒక్క అవినీతి కూడా లేకుండా దేశ ప్రజలకు సేవ చేస్తూ దేశాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో 85 శాతం అవినీతి చేతుల్లో ఉంటే కేవలం 15 శాతం మాత్రమే ప్రజలకు చెందేది అని గుర్తు చేశారు. కానీ నరేంద్ర మోడీ పరిపాలనలో నేరుగా లబ్ధిదారుకు మాత్రమే లబ్ధి చేరుతుందని గుర్తు చేశారు. 44 లక్షల కోట్ల రూపాయలు మధ్య వర్తులు లేకుండా లబ్ధిదారుల ఖాతాలకు వెళ్లడం జరిగింది అని, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 25 కోట్ల మందిని దారిద్య్రరేఖ పైనకు తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోడీ ది అని అన్నారు. ప్రపంచంలోనే నాలుగోవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోడీ ది అని అన్నారు. భద్రత విషయంలో మొన్న జరిగిన పెహల్గామ్ దాడికి ప్రతి చర్యగా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ కి బుద్ధి చెప్పిన తీరు వాడినా మిస్సల్స్ అద్భుతం అని అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో భ్రమ్మోస్ మిస్సాయిల్ పాకిస్థాన్ కి చుక్కలు చూపించిన విషయాన్ని పాకిస్తాన్ అధ్యక్షులే స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ మన భారతదేశంలో ఉంటున్న కొందరు రాజకీయ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని, సైనిక దళాలను, మన దేశ నాయకత్వాన్ని చులకన చేస్తూ మాట్లాడడం జరుగుతుంది అని అలా ప్రవర్తించే ప్రవర్తనని దేశద్రోహం అని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది అని అన్నారు. సాంస్కృతిక పునర్జీవన విషయంలో కూడా భారతదేశం అభివృద్ధి చెందింది అని వందల సంవత్సరాలుగా గుడి లేని రామునికి భవ్యమైన గుడి కట్టించిన ఘనత నరేంద్ర మోడీ ది అని గుర్తు చేశారు. ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోడీ  వలన జూన్ 21వ తేది నాడు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిదంగా ముస్లింలకు సంబంధించిన త్రిబుల్ తలాక్ విషయంలో గానీ పౌరసత్వానికి సంబంధించిన సి ఎ ఎ విషయంలో గానీ నరేంద్ర మోదీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు ప్రపంచం దేశాలన్నీ భారత్ వైపు చూసే విధంగా ఉన్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉయ్యాల ఎమాజి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పట్టి వెంకటకృష్ణ, దుర్గం అశోక్, పురుషోత్తం జాజు, పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణమూర్తి, ఆకుల అశోక్ వర్ధన్, రాపర్తి వెంకటేశ్వర్లు, కార్యక్రమం కన్వీనర్ వెంకటేశ్వరరావు, కో కన్వీనర్లు శ్రీకృష్ణదేవరాయలు, బండి మల్లికార్జున్, జాడి తిరుపతి. జోగుల శ్రీదేవి, తోట మల్లికార్జున్, అక్కల రమేష్, రాచర్ల సంతోష్ మరియు మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్