వడ్ల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి
మార్కెట్లలో కనీస సౌకర్యాలు కల్పించాలి
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి
అక్టోబర్ 29
చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డి పల్లె గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు
ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి రైతులు వడ్లని తీసుకొచ్చి మార్కెట్లో బోసి 15 రోజులు గడిచిన నేటి వరకు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోవడం సిగ్గుచేటు అని కత్తుల భాస్కర్ రెడ్డి అన్నారు
వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి కనీస సౌకర్యాలైన త్రాగునీరు, జల్లెడ పట్టే మిషిన్లు, బార్ దాని, కరెంటు సౌకర్యం, టెంటు, లారీలు, హమాలి వాళ్లను అందుబాటులో ఉంచి కనీస సౌకర్యాలను వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో పోరెడ్డి కనకయ్య, కత్తుల విమల, మాడబోయిన కవిత,, బట్టు రజిత, చింతల కనకవ్వ, లచ్చవ్వ, మల్లవ్వ, ఎల్లవా, బుచ్చవ్వ తదితరులు పాల్గొన్నారు
