ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్ 2, గూడెం గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ గూడెం శాఖ ఆధ్వర్యంలో గతసంవత్సరం గూడెం గ్రామానికి చెందిన మందాడి ఆశయ్య యాదవ్ ప్రమాదవశాత్తు చెట్టు పైనుండి పడి మరణించడం కారణంగా ఆయనకి ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ ప్రమాద బీమా 500/-రూ.ఎస్బిఐ జనరల్ బీమా ఉన్నందున అతని కుటుంబానికి (10లక్షల రూపాయలు) బీమా వర్తించింది ఈ10, లక్షలరూ. చెక్కును టిజిబి బ్రాంచ్ మేనేజర్ చందు, గ్రామ సర్పంచ్ సరిత – శ్రీనివాస్ రావు, ఉపసర్పంచ్ చాడశ్రీనివాస్, ఎంపీటీసీ శ్రీధర్ చేతుల మీదుగా అశయ్యభార్య భూలక్ష్మి వారి కుటుంబ సభ్యులకి అందించారు. టిజిబి బ్రాంచ్ మేనేజర్ చందు మాట్లాడుతూ దయచేసి18 సం.పైబడిన వారు మీరు మీకుటుంబ సభ్యులకి పిఎంజెజెబివై 436/- రూ.పిఎంజెజెబివై 20/- రూ.ఎస్బిఐ జనరల్ ఇన్సూరెన్స్ చేయించుకోండి అని తెలియజేశారు. ఈకార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ రవి, క్యాషియర్లు, పర్శరాములు,మనోజ్, గ్రామ నాయకులు బాలయ్య, ఏల్లగౌడ్, మల్లేష్, పర్శరాములు, సంతోష్, అక్షయ్, వెంకట్ రాజం, గ్రామ ప్రజలు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఐకేపీ వివోఏలు తదితరులు పాల్గొన్నారు.
