దౌల్తాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు అన్నారు. శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ శివాజీ చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి 4 వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఇందిరమ్మ ఇల్లు తదితర పథకాలను ప్రవేశపెట్టి పేదలకు అందజేశారన్నారు. దుబ్బాక నియోజకవర్గం లో ముత్యం రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప కొత్తది ఏమి చేసింది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బండారు లాలు, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్, మాజీ ఎంపీటీసీ మద్దెల స్వామి, నాయకులు ఎర్రయ్య, భద్రయ్య, సత్తయ్య, మల్లారెడ్డి, మహేష్, ఆంజనేయులు గౌడ్, లింగం, రాజు, పంజా రమేష్, యాదవ రెడ్డి, శ్రీనివాస్, ప్రసాద్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు….
