కన్వేయన్స్ డ్రైవర్ల వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారానికి అధికారులు, ఓనర్లు సహకరించాలి.
ఎస్ సి కె ఎస్ – సి ఐ టి యు ఆధ్వర్యంలో నిరసన, ఆందోళనలో భాగంగా నల్లారిబ్బన్నలతో విధులు నిర్వహిస్తున్న కన్వేయన్స్ డ్రైవర్లు.
సమస్యలను సమరస్యంగా పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాం. కాసీపేట రాజేశం
సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు బ్రాంచ్ సహాయ కార్యదర్శి.
శ్రీరాంపూర్ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్పి ఓ సి పి లో పనిచేస్తున్న కన్వేయన్స్ డ్రైవర్ల వేతనాలు పెంచాలని, ఇతర సమస్యలను అధికారులు, ఓనర్లు సానుకూలంగా స్పందించి పరిష్కారించాలని కోరుతూ ఎస్సీ కేఎస్ సిఐటియు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తు విధులకు హాజరైన కన్వేయన్స్ డ్రైవర్లు. ఈ సందర్భంగా నాయకులు కాసీపేట రాజేశం మాట్లాడుతూ…
సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కన్వేయన్స్ డ్రైవర్ల పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా ఉంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు లేక కుటుంబాలను పోషించుకోలేక సతమతమవుతున్నారు. అధికారులు, వెహికల్ ఓనర్లు సానుకూలంగా స్పందించి కన్వేయన్స్ డ్రైవర్ల వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరడం జరిగింది. లేకుంటే పోరాటాన్ని వివిధ రూపాల్లో ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో సంపత్ రావు, కలవేని సతీష్, తోకల రాజుకుమార్, వినేయ్, సూర అనీల్, నవీన్, శ్రావణ్, వెంకటేష్, రవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.





