ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామానికి మాజీ ప్యాక్స్ ఛైర్మన్ సింగిరెడ్డి మాధవరెడ్డి ఆనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో భాదపడుతుండగా వైద్య ఖర్చుల నిమిత్తం 1,50,000 గల ఎల్ఓసి పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రతా కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ స్వయంగా హాస్పిటల్ కి వెళ్లి ఎల్ఓసి పత్రాన్ని అందజేసి,వైద్యులను ఆరోగ్య పరిస్థితులను గురించి అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు..
ఎల్ఓసి పత్రన్ని మంజూరీ చేసిన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి, సహకరించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కి,మంత్రి వర్యులు కేటీఆర్ కి, తన్నీరు హరీష్ రావు కి,రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్ కి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు..