ప్రాంతీయం

ఘనంగా డా:వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి

190 Views

ముస్తాబాద్, సెప్టెంబర్ 2, మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్: వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు రాజశేఖర్ రెడ్డి రాష్ట్రం అంతట పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల గోడు ప్రత్యక్షంగా విని కొన్ని పథకాలు రూపొందించారు.108 అంబులెన్స్ సర్వీస్ లు, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, రైతులకు మామిడి మొక్కలతో పాటు డ్రిప్ ఇరిగేషన్ రాయితీ, రోడ్లకు ఇరువైపులా కానుగ మొక్కలు, ఉపాధిలేనివారికి ఉపాధి, వృద్ధులకు 200 రూపాయల పింఛన్, ఒక్క రూపాయికిలో బియ్యంతో పాటు పలురకాల నిత్యవసర వస్తువులు రేషన్, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లుఇచ్చి దిగువ మధ్యతరగతి కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారు. ఫీజు రియంబర్స్మెంట్ తో ప్రతి పేదవిద్యార్థి కూడా పైచదువులు కూడా చదవచ్చు అనే ధైర్యాన్ని యువకులలో నింపారు. రైతులకు రుణమాఫీ అనేమాటే ఏ నాయకునికి తెలువని పథకం తీసుకొచ్చి ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసి నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించి ప్రతి రైతు కుటుంబంలో ప్రత్యక్ష దైవంలా నిలిచాడు అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొండం రాజిరెడ్డి, గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లాకో- కన్వీనర్ రమేష్, తలారి నర్సింలు, గోవర్ధన్ నాయక్, శీల ప్రశాంత్, పలుగ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు దుంకుల కొండయ్య, బత్తుల నవీన్, సడిమల బాలయ్య, వేలుముల రాంరెడ్డి, ఉచ్చిడి బాల్ రెడ్డి, వేముల సత్యంగౌడ్, ఆరుట్ల మహేష్ రెడ్డి, రంజాన్ నరేష్, మిడిదొడ్డి భాను, మామిoడ్ల ఆంజనేయులు, కేసుగని వెంకటేష్, శివగౌడ్, కళ్యాణ్, మారుతి, ప్రేమ్ కుమార్, తదితరలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *