ప్రాంతీయం

ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం

111 Views

గర్మిల్ల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సాయిరాం ఫంక్షన్ హాల్ లో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిభిరం విజయవంతం.

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని సాయిరాం ఫంక్షన్ హాల్ లో ఉచిత నేత్ర వైద్య చికిత్స శిబిరం నిర్వహించడం జరిగింది. రేకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ మరియు గర్మిళ్ల లయన్స్ క్లబ్ మంచిర్యాల వారు సంయుక్తంగా నిర్వహించిన ఈ శిబిరంలో 350 మంది తమ పేరు నమోదు చేసుకుని బిపి షుగర్ పరీక్షలు నిర్వహించిన అనంతరం రేకుర్తి కంటి ఆసుపత్రి ప్రతినిధి సిహెచ్ ప్రభాకర్ ,స్థానిక డాక్టర్ భాస్కర్ రెడ్డి ,ఇలియాస్ కంటి పరీక్షలు నిర్వహించి 185 మంది రేకుర్తి ఆసుపత్రికి కంటి ఆపరేషన్ కోసం పంపించడానికి అర్హత పొందాలని ప్రకటించారు.

ఈరోజు మొదటి విడతగా 35 మందిని రేకుర్తి బస్సు ద్వారా పంపించడం జరిగిందని, మిగితా వారిని విడుతల వారిగా పంపించడం జరుగుతుంది అని గర్మిళ్ల లైన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మోదుంపురం వెంకటేశ్వర్ ఎం జె ఎఫ్ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గర్మిళ్ల లయన్స్ క్లబ్ కోశాధికారి లయన్ శంకర్ లింగం, సామాజిక కార్యకర్తలు జాడి తిరుపతి, గర్రెపల్లి వెంకట నర్సయ్య, నిమ్మల సాగర్, కోమటిపల్లి రమేష్,ఐత జగదీశ్,కుందారపు రవీందర్,ఎస్ మోహన్, అకినేపల్లి మహేశ్వర్, నాగేశ్వర్, వెంకటేశ్,స్థానిక ఆర్ఎంపీ వైద్యులు మహేష్, సిరంగి సంపత్ ఆశ సిబ్బంది, వికాస తరంగిణి కో ఆర్డినేటర్ లక్ష్మా గౌడ్ వారి బృందానికి మరియు నేత్ర శిభిరం విజయవంతం కావడానికి సహకరించిన వారందరికి గర్మిల్ల లయన్స్ క్లబ్ తరపున ధన్యవాదములు తెలియజేసారు.

No Slide Found In Slider.

Poll not found