*గద్దర్,సాయి చంద్ ల సంస్మరణ సభను విజయవంతం చేయాలి.*
-జాతీయ మాల మహానాడు రాష్ట్ర కో ఆర్డనేటర్ ర్యాకం శ్రీరాములు.
దళిత బహుజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే పీడిత ప్రజల గొంతుక ప్రజా యుద్ద నౌక గద్దర్, ప్రజా గాయకులు సాయి చందుల సంస్మరణ సభను విజయవంతం చేయాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర కో ఆర్డనేటర్ ర్యాకం శ్రీరాములు అన్నారు.శనివారం రాయపోల్ మండల కేంద్రం అంబేడ్కర్ చౌరస్తాలో విలేకరులతో వారు మాట్లాడుతూ ప్రజా యుధ్ధ నౌక గద్దర్, ప్రజా గాయకులు సాయి చందు జీవితమంత అణగారిన,పీడిత ప్రజల కోసం పోరాటం చేస్తూనే ప్రజలను చైతన్యం చేస్తూ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ జీవితమే త్యాగం చేశారని వారు నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. గద్దర్, సాయిచంద్ ఇద్దరు స్ఫూర్తిగా నేటితరం చైతన్యవంతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. దళిత బహుజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 3 వ తేదీన ఆదివారం దుబ్బాక పట్టణం బాలాజీ ఫంక్షన్ హాల్ లో గద్దర్, సాయి చందుల సంస్మరణ సభ నిర్వహించడం జరుగుతుందని ఈ సంస్మరణ సభకు ముఖ్య అతిథులుగా గద్దర్ కూతురు గుమ్మడి వెన్నెల, సాయిచంద్ సతీమణి రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్పర్సన్ రజిని సాయిచంద్, మాల జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందాల భాస్కర్, కవి గాయకులు మిట్టపల్లి సురేందర్, ఎపూరి సోమన్న, శరత్ చంద్ర తదితరులు హాజరవుతున్నారు. కావున ప్రజాయుద్ధ నౌక గద్దర్, ప్రజా కళాకారులు సాయిచంద్ ల సంస్మరణ సభకు కవులు, కళాకారులు, మేధావులు,ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదలు,ఉపాధ్యాయులు, విద్యావంతులు, యువకులు అధిక సంఖ్యలో హాజరై ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు బండారు దేవేందర్, ముంగిస్ పల్లి సర్పంచ్ స్వామి, తెలంగాణ మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి తాడెం కృష్ణ, రమేష్, స్వామి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.