మెదక్ లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీసీ బిడ్డ నీలం మధు గెలుపు ఖాయం అని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పట్టణ యూత్ అధ్యక్షులు కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ అన్నారు. దుబ్బాక పట్టణంలోని సిఎస్ఆర్ క్యాంప్ కార్యాలయంలో దుబ్బాక మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చామన్నారు. బీసీ ప్రజలు యువత, మహిళలు, రైతులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, పార్టీ నాయకులు కార్యకర్తలు ఆశీస్సులతో మెదక్ ఎంపీగా బీసీ బిడ్డ నీలం మధు గెలుపొందడం ఖాయమని మున్సిపల్ పట్టణ యూత్ అధ్యక్షులు బురాని శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశారు.




