ప్రాంతీయం

పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ…

401 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి ఏప్రిల్ 28, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి గ్రామాల్లోని ప్రజలకు సీజనల్ వ్యాధి రాకుండా వైద్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సాధారణ ప్రసవాలు 100 శాతం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో జరిగే విధంగా గర్భిణీలకు సలహాలు సూచనలు ఏఎన్ఎంలు అందించాలని ప్రభుత్వం ఆరోగ్య కేంద్రంలో నిర్వహించే అన్ని రకాల సదుపాయాలను ప్రజలు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ గీతాంజలి హెచ్ఇఓ యాదగిరి సూపర్వైజర్స్, ప్రసాదు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *