మంగపేట , సెప్టెంబర్ 01
మంగపేట మండలం పిఆర్టి యు టిఎస్ మండల శాఖ అధ్యక్షులు చంద భద్రయ్య ఆధ్వర్యంలో సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధా నమును అమలు పరచాలని మండలం లోని ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపిన మం గపేట తాసిల్దార్ కి విర స్వామికి మెమరాండం ఇచ్చారు.ఈ సందర్భంగా చందా భద్రయ్య మాట్లాడుతూ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని కనుక వెంటనే సి పి ఎస్ ను రద్దుచేసి ఓ పి ఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ ప్రధాన కార్యదర్శి చింతా లక్ష్మీనారాయణ,మండల కార్యదర్శి చేరాల రాజేశ్వర రావు,మహిళా కార్యదర్శి మేనక ,జిల్లా కార్యదర్శి అబ్బు సత్యనారాయణ సీనియర్ కార్యకర్తలు కొరస సారయ్య, పెట్రం సుధాకర్ రావు, పిల్లలమర్రి సాంబశివరావు, జమీల్,రఘు,రాజు, పాల్గొన్నారు.




