ప్రాంతీయం

పోగొట్టుకున్న చరవాణి ని బాధితురాలి కి అందజేసిన ఎస్సై

187 Views

ఎల్లారెడ్డి పేట మండలం
పోగొట్టుకున్న చరవాణి ని బాధితురాలి కి ఎల్లారెడ్డి పేట ఎస్సై కే రమాకాంత్ శుక్రవారం అందజేశారు.
( సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడింటిటి రిజిస్టర్ ) యాప్ ద్వారా నెల రోజుల క్రితం పోయిన సెల్ ఫోన్ గుర్తించి తిరిగి అందజేశారు. ఎల్లారెడ్డి పేట కు చెందిన చెన్ని గోపి గత జూలై 25 న పోలీస్ స్టేషన్ కు వచ్చి తన యొక్క సెల్ ఫోన్ ను ఎల్లారెడ్డి పేట లో పోయిందన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. సెల్ ఫోన్ ( ఐ ఎం ఈ ఐ ) నెంబర్ ద్వారా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ యాప్ లో అప్ లోడ్ చేయగా సెల్ ఫోన్ దొరికిన వ్యక్తిని గుర్తించామన్నారు. అట్టి సెల్ ఫోను స్వాధీనం చేసుకొని, తిరిగి ఫిర్యాదు భార్య కి శుక్రవారం ఎల్లారెడ్డిపేట యస్.ఐ.రమాకాంత్ అందజేశారు. ఎవరు సెల్ ఫోన్ అయిన తిప్పి పోయిన వారు నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు . ఈ యాప్ ద్వారా అప్ లోడ్ చేసుకున్న వారి సెల్ ఫోన్ త్వరగా గుర్తించడానికి అవకాశం ఉందని ఎల్లారెడ్డిపేట యస్.ఐ కే రమాకాంత్ తెలియజేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *