దౌల్తాబాద్: ఏబీవీపీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు రజనీకాంత్, వెంకటేష్ లో మాట్లాడుతూ రక్షాబంధన్ కుటుంబ, సామాజిక, దేశ ఐక్యతకు చిహ్నం అని, మన సంస్కృతిలో భాగం సాంప్రదాయ బద్ధంగా కొనసాగిస్తున్నామని అన్నారు. మతం వ్యక్తి గతం, దేశ రక్షణ అందరి బాధ్యత అని అన్నారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతి పండుగకు విశేషమైన ప్రాధాన్యత ఉందన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు ఒకరికొకరు రాఖీ కట్టుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు…..




