ప్రతి ఇంటింటికి తిరిగి మట్టి స్వీకరణ చేసిన కార్యక్రమం
హుజురాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఆకుల రాజేందర్
ఆజాద్ కా అమృత ఉత్సవాల సందర్భంగా
సెప్టెంబర్ 1
ప్రధానమంత్రి సూచన మేరకు జమ్మికుంట మండలంలోని సైదాబాద్ గ్రామంలో బిజెపి మండల అధ్యక్షులు సంపెల్లి సంపత్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నా దేశం నా మట్టి ( మేరీ మాటి మేరీ దేశ్ ) అనే కార్యక్రమం హుజురాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ ఆకుల రాజేందర్ పాల్గొని ప్రతి ఇంటింటికి తిరిగి మట్టి స్వీకరణ చేశారు, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గోపాలరావు, శ్రీకాంత్, కాసర్ల రాములు, బిజెపి నాయకులు భీమరి వెంకటేశ్వర్లు, భీమిరి కిషన్ రావు, తిరుపతి, ఈశ్వర్ అనేకమంది గ్రామ ప్రజల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది.
దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో మట్టి స్వీకరణ జరిపించి ఢిల్లీకి పంపించే విధంగా, ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అమృతవనం నిర్మించే సందర్భంలో మన మట్టిని ఉపయోగిస్తారని కావున అన్ని గ్రామాల ప్రజలు కార్యక్రమం సహకరించాలని ఆకుల రాజేందర్ అన్నారు
