ఏటూరునాగారం, సెప్టెంబర్ 01
ఏటూరునాగారం మండలంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మానవ సంబంధాలు సంస్కృతీ సాంప్ర దాయాలు ఆచారాలు కాపా డుకోవడం కోసం రక్షా బంధన్ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఒకరికొకరు నీవు నాకు రక్ష నేను నీకు రక్ష మనం దరం ఈ ధర్మానికి దేశానికీ రక్ష అనే నినాదంతో రక్షా బంధన్ ఉత్సవంలో విద్యార్థులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రఖండ ప్రముఖ్ చౌలం సాయిబాబు,వైస్ ప్రిన్సిపాల్ బిజాంభీ,కెమిస్ట్రీ లెక్చరరు కురందుల రఘుపతి, అధ్యాపకుల బృందం పాల్గొన్నారు.