ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆగస్టు31, పండగపూట విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవస్తు బావిలో పడి కౌలు రైతు మృతి చెందాడు. ముస్తాబాద్ మండల కేంద్రంలో అనవేణి నర్సయ్య ముస్తాబాద్ శివార్లు 5 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వరిపంట వేశాడు. పొలానికి నీళ్లు ఎక్కువ అవుతున్నాయని, కరెంట్ మోటర్ బందు చేద్దామని పొలంలోకి వెళ్లిన నర్సయ్య షాటర్ దగ్గరికి వెళ్లి బందు చేసే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడ్డాడు. రొట్టెలు చేయి బిడ్డ వచ్చి తింటానని నర్సయ్య బిడ్డకు చెప్పి వెళ్ళాడు. ఎంతసేపైనా నర్సయ్య ఇంటికి రాపోయేసరికి భార్య మంగ బంధుమిత్రులతో వెతికగా బావిలో నర్సయ్యకు సంబంధించిన వస్తువులు తేలి ఉండడంతో బోరున విలపించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎస్సై శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. బావిలో నీళ్లు అధికంగా ఉండడంతో మోటార్లతో సహాయంతో నీళ్లను తోడేశారు. నర్సయ్యకు బిడ్డ హారిక కొడుకు రేశ్వంత్ ఉన్నారు. తమ్మి నరసయ్య ఎవరికీ కట్టాలి రాకే అనిఅక్క రాజమణి రోధిస్తున్న తీరును చూసి చూసి అక్కడ ఉన్నవారంతా కంటతడి పెట్టుకున్నారు. మృతదేహం కోసం మూడు నాలుగు గంటలుగా శ్రమించి పోలీసులు గ్రామస్తులు సహాయక చర్యలు చేపట్టి నరసయ్య మృతదేహాన్ని బావిలోనుంచి తీసి పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
