పారిశుద్ధ కార్మికునికి రాఖీ కట్టిన కొండ రేణుక
ఎల్లారెడ్డిపేట.అనాధగా ఉన్న ఓ తమ్మునికి అక్క అయ్యింది. రాఖీ కట్టింది. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ పంచాయితీ పారిశుద్ధ కార్మికులుగా పనిచేస్తున్న తల్లి దండ్రులు లేని అనాధ అని తెలుసుకొని గురువారం కొండ రేణుక రమేష్ దంపతులు తమ స్వగృహానికి పిలిపించుకొని రాఖీ కట్టి మిఠాయి తినిపించి సోదర భావం వ్యక్తపరిచి తన ఔదార్యాన్ని చాటుకుంది. ఈ సందర్భంగా కొండ రేణుక మాట్లాడుతూ రాఖీ కట్టడానికి రక్త సంబంధం అవసరం లేదని తల్లిదండ్రులు లేని ఆ కార్మికునికి ఓ అక్కగా రాఖీ కట్టానని తన సంతోషాన్ని వ్యక్తపరిచింది.





