ప్రాంతీయం

అనురాగం అనుబంధాలకు ప్రతీక రక్షాబంధన్*

69 Views

– పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు

రాయపోల్:
రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ప్రాథమికోన్నంత పాఠశాల లో ఆకట్టుకున్న రాఖీ వేడుకలు. టీచర్ల సహకారంతో చిన్నారులు ఒకరికొకరు రాఖీలు కడుతూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు మాట్లాడుతూ తరతరాలుగా పండగలు మనం జరుపుకుంటూ దాంట్లో భాగంగానే ఈ రాఖీ పండుగను పాఠశాలలో ఘనంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు. రాఖీ పండుగ ముఖ్య ఉద్దేశం అన్న చెల్లెల మధ్య ఆత్మీయ అనురాగాలు కలగలిపి ఈ రాఖీ పండుగ జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. పాఠశాలలో ప్రతి పండుగను జరుపుకోవడం జరుగుతుంది అని దానికి సంబంధించిన విశిష్టతను పిల్లలకు వివరించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాల్ రెడ్డి, వంశీకృష్ణ, రమాదేవి, విద్యా వాలంటీర్ స్రవంతి, మంజుల విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ఉషనగల్ల నర్సింలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *