*బిజెపి ఎస్సీ మోర్చా గజ్వేల్ నియోజకవర్గం కన్వీనర్ గా ఆకారం అశోక్*
ఎస్సీ మోర్చా బిజెపి గజ్వేల్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ గా ఆర్ అండ్ ఆర్ ఎర్రవల్లి కాలనీ కి చెందిన ఆకారం అశోక్ ని నియమించినట్లు ఎస్సీ మోర్చా అధ్యక్షులు మంగిడి స్వామి తెలిపారు ఈ సందర్భంగా ఆకారం అశోక్ మాట్లాడుతూ నాకు పై నమ్మకం ఉంచి ఈ యొక్క పదవి ఇచ్చినందుకు బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు దూది శ్రీకాంత్ రెడ్డి కి,ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మంకిడి స్వామి కి, జిల్లా కార్యదర్శి కుడిక్యాల రాములు కి గజ్వేల్ అసెంబ్లీ కన్వీనర్ సాయి కి, ఉమ్మడి కొండపాక మండల అధ్యక్షులు మన్నెం శశిధర్ రెడ్డి కి , ఎస్సీ మోర్చా జిల్లా ప్రధనకార్యదర్శి నత్తి శివకుమార్ కి, గజ్వేల్ నియోజకవర్గం బిజెపి నాయకులకు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు





