Breaking News

రక్షాబంధన్ రాఖీ ఆప్యాయతా రక్షణ కవచం 

113 Views

రక్షాబంధన్ రాఖీ ఆప్యాయతా రక్షణ కవచం

..సుప్రసిద్ధ చిత్రకారులు రుస్తుం

రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని బుధవారం రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో “రాఖీ రక్షణ కవచం” రాఖీపున్నమి చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, రాఖీ పౌర్ణమి అక్కాచెల్లెళ్ల అన్నాతమ్ముళ్ల ఆత్మీయ ఆప్యాయతా  బంధానికి రక్షణ కవచం రక్షాబంధన్. తరతరాలుగా భారతదేశ సంస్కృతులు ఉమ్మడి కుటుంబాల ఆత్మీయత అనుబంధాలు ప్రేమానురాగాలు వాచ్ఛల్యానికి ఎల్లవేళలా విడిపోని బంధమై కళాత్మక జీవన సౌందర్యాన్ని బలోపేతం చేస్తూ పరిమళిస్తుంటాయి. ప్రపంచ దేశాలకు అంతుపట్టని భారతజాతి సంస్కృతి సంప్రదాయం ఆచార వ్యవహారాలు ఉమ్మడి కుటుంభం భిన్నత్వంలో ఏకత్వం ఐక్యత వారిని మంత్ర ముగ్దులను చేస్తున్నవి. మన భారతదేశ సంస్కృతిని ఎల్లవేళలా కాపాడుకుంటూ రాఖీ పౌర్ణమి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు ఐకమత్యం పెంపొందించాలని, ప్రపంచ మానవాళికి భారత జాతి లౌకికత్వ పరిమళాలు గుభాళించాలని ప్రఖ్యాత మానవతా చిత్రకారులు రుస్తుం ఆకాక్షించారు. ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *