వార్డు మెంబర్లు రాజీనామాలు.
ఆగస్టు 30, వికారాబాద్ జిల్లా పుడూర్ మండలములోని చంగోముల్ గ్రామపంచాయతీ వార్డుమెంబర్లు 6గురు, రాజీనామా పత్రాలు ఎంపిడివో ఆఫీస్ సూపరిండెంట్ వరలక్ష్మి కి అందచేశారు. గ్రామసర్పంచ్ మా వార్డులో ఏమి అభివృద్ధి చేయడం లేదని, ప్రజలకు మేము ఏమి చెప్పుకోలేని పరిస్థితి ఉందన్నారు. మామీద సర్పంచ్ కావాలనే మా వార్డులకు అభివృద్ధి చేయడం లేదని ఆవేదన చెందారు. వార్డు సభ్యులు లలిత యాదగిరి నరసింలు గౌడ్ తహిమినన్ స్వప్న ఆనంద్ మరియు పరిగి అసెంబ్లీ వైస్ ప్రసిడెంట్ నవీన్ కుమార్ తో కలిసి రాజీనామా పత్రాలు ఇవ్వడం జరిగిందని అన్నారు.





