ముస్తాబాద్, ప్రతినిధి, తెలంగాణ ప్రభుత్వం అన్ని అంగన్వాడీ కేంద్రాలకు పోపు దినుసులు..ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా అంగన్వాడీ పిల్లలకు గర్భిణీలకు మరియు బాలింతల కోసం కారంపొడి 300gms, పోపుదినుసులు 200 gms, పసుపు 100gms, ఆయోడైజ్డ్ సాల్టు 500 gms , చింతపండు 500gms లాంటి నిత్యవసర వస్తువులను ఒక ప్యాక్ లో ప్రభుత్వం నుంచి సరఫరా చేయడం ప్రారంభించడం జరిగింది. అంగన్వాడీ టీచర్లకు ఆర్థిక భారం తప్పించేందుకుగాను వీటిని ప్రభుత్వమే కొనుగోలు చేసి అన్ని కేంద్రాలకు ప్రభుత్వమే సరఫరా చేస్తున్నది. దీని ద్వారా అంగన్వాడీ టీచర్లకు ఆర్థిక భారం మరియు సేకరణ భారం తగ్గడంతో వారు మరింతగా పిల్లలకు నాణ్యమైన సేవ చేయడం వీలు కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీరాజం మాట్లాడుతూ అంగన్వాడీలు మరింత నాణ్యమైన సేవలతో ముందుకు వెళ్లాలని, అందరు పిల్లల్ని ప్రీస్కూల్ కు వచ్చే విధంగా చూడాలని, గర్భిణీలకు బాలింతలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఏసీడీపీఓ సుచరిత సూపర్వైజర్ మమత టీచర్ జ్యోతి పోషణ అభియాన్ అసిస్టెంట్ రాజు పాల్గొన్నారు. ఈసందర్భంగా రుద్రంగిలోని పలు సెంటర్లను సందర్శించారు.
