ఆర్ టి ఈ యాక్టును సవరించాలి
-జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్
సిద్దిపేట జిల్లా, నవంబర్ 19
ఆర్ టి ఈ యాక్టును సవరించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సభ్యత్వ సేకరణలో భాగంగా వర్గల్ మండలంలోని గౌరారం, నగరంతాండ, ఆవుసులోని పల్లి, వర్గల్, తునికి ఖల్సా, తునికి మక్త, మీనాజీపేట్, అంబర్ పేట్, శాకారం, గోవిందాపూర్, నెంటూరు మజీద్ పల్లి, నాచారం, అంతగిరి పల్లి, వేలూరు పాఠశాలలు సందర్శించి సమస్యలు సేకరించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్ టి ఈ యాక్టులో టెట్ నిబంధన పెట్టడం ద్వారా దేశవ్యాప్తంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని వెంటనే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని దేశవ్యాప్తంగా నెలకొని ఉన్న ఈ టెట్ సమస్యకు మూలం అయినా ఆర్ టి ఈ యాక్టును సవరించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, అంతర్ జిల్లా బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలనీ, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, ఉద్యోగ విరమణ చేసిన ఊధ్యాయులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు అందజేయాలనీ అన్నారు.ఇట్టి కార్యక్రమంలో జోన్ కన్వీనర్ శ్రీనివాస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పర్వతం నరసయ్య పిల్లి రాములు జిల్లా కౌన్సిలర్లు నర్సింగరావు సంతోష్ జగదేవపూర్ మండల ప్రధాన కార్యదర్శి పోచం తదితరులు పాల్గొన్నారు





