*పినపాక నియోజకవర్గం లోని పలు గ్రామాలలో విస్త్రతం గా పర్యటన జరిపి కార్యకర్తలలో ఉత్సహం పల్లె ప్రజలకు భరోసాను ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రిl జిల్లా ఆడబిడ్డ ఫైర్ బ్రాండ్ లీడర్ శ్రీమతి రేణుకా చౌదరి* గారు
*వరద బాధిత రైతులకు అండగా నిలిచిన మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి.*
*ఆళ్లపల్లి, గుండాల రైతులకు ఉచితంగా ఎరువు బస్తాలు పంపిణీ చేసిన రేణుకా చౌదరి.*
*150 మంది రైతులకు 500 బస్తాల ఎరువులు ఉచితంగా పంచి, కాంగ్రెస్ ఉంది అని ధైర్యాన్ని ఇచ్చిన రేణుకా చౌదరి.*
జగ్గయ్య గూడెం గ్రామం లో గ్రామ ప్రజలతో కలిసి సహాపంక్తి భోజనం చేసి అనంతరం పల్లె నిద్ర చేసారు, ఉదయం గ్రామ ప్రజలతో కలిసి రచ్చబండ కార్యక్రమం లో పాల్గొని వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు, అనంతరం గ్రామ వ్యవసాయ కూలీలను ట్రాక్టర్ పై ఎక్కించి తానే స్వయం గా డ్రైవ్ చేస్తూ వ్యవసాయ క్షేత్రలకు వెళ్లి అక్కడ వారితో కలిసి వరి నాట్లు వేశారు, ఈ సందర్బంగా శ్రీమతి రేణుకా చౌదరి గారు మాట్లాడుతూ రైతులకు, దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల కు అండగా నిలబడ్డ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కెసిఆర్ మోడీ లు మోసపూరీత హామీలతో అధికారం లోకి వచ్చాక ఏ ఒక్క హామీ ని అమలు చెయ్యలేదని కెసిఆర్ మోడీ లను నమ్మి మరోసారి మోసపోవద్దని, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటువేసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుందాము అని అన్నారు
*రేణుకా చౌదరి వెంట ldm ఖమ్మం పార్లమెంట్ కోఆర్డినేటర్ సూరంపల్లి రామారావు,రాష్ట్ర కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి రామసహాయం మాధవీ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ నాయకులు లక్కినేని సురేందర్, dr శంకర్ నాయక్ పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు విజయ్ గాంధీ, జిల్లా కాంగ్రెస్ నాయకులు నున్నా రామకృష్ణ, దారావత్ రామ్మూర్తి నాయక్, సత్యనారాయణ చౌదరి,గోపి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు శ్రీమతి పోరెడ్డి విజయలక్ష్మి, పగడాల మంజుల, ముత్తయ్య తదితరులు ఉన్నారు,
