ఫీరీల పండుగ నిర్వాహాన కమీటీ కి కృష్ణారెడ్డి ఆర్థిక సహాయం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని . కిషన్ దాస్ పేట మజీద్ లో ఫీరీల పండుగ నిర్వాహాన కమీటీ సభ్యులకు ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అద్యక్షులు గుండారపు కృష్ణా రెడ్డి గురువారం 5000 రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని అందజేశారు, ఈ సందర్భంగా సింగిల్ విండో అద్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో హింధూ ముస్లింలు కలిసి కుల మతాలకు ఆతీతంగా హిందూ ముస్లింలు బాయి బాయి అని జరుపుకునే పండగనే ఫీరీల పండుగ అని జాతీయ సమైఖ్యతకు ఇది నిదర్షనమన్నారు , కిషన్ దాస్ పేట మజీద్ లో ఫీరీల పండుగ నిర్వహించడానికి మజీద్ చుట్టుపక్కల ఉన్న వివిధ కులాలకు మతాలకు చెందిన యువత ఫీరీల పండుగ నిర్వాహాన కమీటీ ఎర్పాటు చేసుకొని పలువురికి ఆదర్షంగా నిలిచి సమైఖ్యత చాటుకున్నారని అయన వారిని అభినందించారు , ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి , మండల కో ఆప్షన్ మాజీ నెంబర్ హసన్ బాయ్ , వార్డ్ సభ్యులు కొడుమోజూ దేవేందర్ , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మేఘి నర్సయ్య , స్వామి గౌడ్ , పీరీల పండుగ నిర్వహణ కమిటీ అద్యక్షులు దోమల భాస్కర్ , కార్యదర్శి ఎం డి రియాజ్ , ఎండి ఆసీఫ్ , కమీటీ సభ్యులు ఎండి ధర్వేశ్ , యమగొండ పద్మారెడ్డి ,గోషిక జనార్దన్ , దేవదాస్ , మ్యాన భగవాన్ , సుంకి ప్రకాష్ , గుండెళ్ళి స్వామి గౌడ్ , రాపెళ్ళి రమేష్ ,గజ్జెల నర్సింహులు ,తదితరులు పాల్గొన్నారు ,




