*రంగ రంగ వైభవంగా బోనాల జాతర*
హైదరాబాద్:జులై 16
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లాల్‌దర్వాజా అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. బోనాల జాతరతో హైదరాబాద్ నగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అమ్మవారిని దర్శించుకోడానికి ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు పోటెత్తారు. ఆలయం దగ్గర బోనాలతో మహిళలు బారులు తీరారు. లాల్‌దర్వాజా బోనాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు పెట్టారు. కాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న బోనాల జాతరకు పోలీసులు 15 వందల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాలు జరిగే పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించి బోనాలు ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు..





