Breaking News

ముదిరాజులంట్టే కేసీఆర్ కు మొదటినుండి చిన్నచూపే! పది సంవత్సరాల కాలంలో ముదిరాజులకు కేసీఆర్ చేసింది ఏమిలేదు! జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

100 Views

ముదిరాజులంట్టే కేసీఆర్ కు మొదటినుండి చిన్నచూపే!

పది సంవత్సరాల కాలంలో ముదిరాజులకు కేసీఆర్ చేసింది ఏమిలేదు!

జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్

తేది: 22-08-23 చిన్నకోడూర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో ముదిరాజులను ఏనాడు పట్టించుకోలేదు ఐన బానిస ముదిరాజులు దొర కాల్లకాడనే ఉంటున్నారని ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మండిపడ్డారు

సంఘ సభ్యులతో కలసి మంగళవారం చిన్నకోడూరులో మాట్లాడుతూ కేసీఆర్ మాయమతలకు మోసపోతున్న ముదిరాజులు కేసీఆర్ ను నమ్మి ఉధ్యమ కాలం నుండి ఎన్నో పోరాటాలు చేసి 60 మంది ముదిరాజ్ ల ప్రాణాలను బలిపెట్టి తెచ్చుకున్న తెలంగాణలో ముదిరాజులకు వచ్చింది ఏమి లేదని అన్నారు

కేసీఆర్ గద్దెనెక్కెవరకు ముదిరాజులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఒకేఒక్కడైన ఈటెల రాజేందర్ ముదిరాజ్ గారికి యం.ఎల్.ఏ మంత్రి పదవులు ఇచ్చి తన కుటుంబం మరియు తన సామాజిక వర్గంను ఆర్థికంగా రాజకీయంగా బలపర్చుకో అన్ని రకాలుగా బలపడ్డంక్క ఈటెలను టీఆరెస్ నుండి బైటకు పంపిన కపటుడు కేసీఆర్ అని మండిపడ్డారు

న్యాయంగా ముదిరాజులకు దామాషా ప్రకారం 12 సీట్లు ఇవ్వాల్సి ఉండగా ఒక్కటి కూడ ఇవ్వకపోవం ఎంతవరకు సమంజసమని అన్నారు

పటన్ చెరు నీలం మధు ముదిరాజ్ లాంటి బలమైన నాయకులు బి.ఆర్.ఎస్ పార్టీలో ఎంతో మంది ఉన్నారని అలంటి నాయకులను పక్కన పెట్టి ఉన్నత వర్గాలకు పెద్దపీట వేశాడని ముదిరాజులు ఇకనైనా మేల్కొని బి.ఆర్.ఎస్ నుండి బైటకు రావాలని అన్యాయం జరిగిన బిసి కులాల మద్దతుతోని బి.ఆర్.ఎస్ కు బుద్ది చెప్పి ముదిరాజులంటే ఏంటో చూపిద్దామని జంగిటి అన్నారు.

ఈ కార్యక్రమంలో దొంతురబోయిన శ్రీనివాస్, గుడిపల్లి వికాస్, రాగిరి యాదగిరి, కోరబోయిన భారత్, శివ, చందు, సుధాకర్ తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *