Breaking News ప్రకటనలు ప్రాంతీయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన సింగిల్ విండో గుండారపు కృష్ణారెడ్డి….

154 Views

బాధిత కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయం అందజేత
– సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి ఉదారత :
ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్/ ఎల్లారెడ్డిపేట
ఆకస్మికంగా అనారోగ్యంతో మృతి చెందిన గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ రేసు బాబు కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అందజేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రేసు బాబు రెండు రోజుల క్రితం ఆకస్మికంగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. శనివారంరోజు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఇచ్చాడు.ఆదివారం రేసు బాబు నివాసానికి వెళ్లి మృతుని భార్యకు 10వేల ఆర్థిక సహాయాన్ని కుల సంఘం సమక్షంలో అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నాడు. ఈ కార్యక్రమంలో కొప్పల్లి రమేష్, బుర్క ఎల్లం,కొత్త మల్లయ్య,జగన్, శ్రీను రవి ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *