ముస్తాబాద్, ప్రతినిధి ఆగస్టు21, వీరబద్రియ వీరముష్టి కులాన్ని1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మిలీనంలోఉన్నప్పుడు వీరభద్ర వీరముస్టీలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని వీరముష్టి జాతిని ముందుకు తీసుకుపోవాలని ఒక సంకల్పంతో 1972లో సంఘమును ఏర్పాటు చేసి వీరముష్టి కులాన్ని విద్య పరంగా ఆర్థికపరంగా ముందుకు నడిపించారు. అప్పుడు ఏర్పాటు చేసిన సంఘం ఇప్పటివరకు 50 సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న హైదరాబాదులో రవీంద్రభారతిలో వేడుకలను జరుపుకొనుటకు వెళ్తున్నామని ముస్తాబాద్ వీరముష్టి సంఘం తెలిపారు. ఈకార్యక్రమంలో వేడుకలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ సంగం నుండి హైదరాబాదుకు బయలుదేరినా ముస్తాబాద్ సంగం అధ్యక్షులు కడారి సారయ్య, ఉపాధ్యక్షులు అగుల్లరవి, ప్రధాన కార్యదర్శి కడారి రాజశేఖర్, కోశాధికారి అగుల్లా శ్రావణ్, సలహాదారులుగా అగుల్ల రాజేశం, ఆగుల్ల వీరేశం, కడారి శివలింగం, సహకార దర్శులుగా కడారి వెంకటేశం అగుళ్ల ప్రవీణ్ ఉన్నారు.




