ప్రాంతీయం

చేపట్టిన నిర్మాణాలను ఫిబ్రవరి 15 లోగా పూర్తిచేయాలి

65 Views

గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన నిర్మాణాలను ఫిబ్రవరి 15 లోగా పూర్తిచేయాలి

జిల్లా కలెక్టర్ కె. హైమావతి 

సిద్దిపేట జిల్లా,జనవరి 

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన నిర్మాణాలను ఫిబ్రవరి 15 లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో ఈజీఎస్ పనుల ప్రగతిపై మండలాలు, గ్రామాల వారీగా జిల్లా కలెక్టర్ ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేద ప్రజలకు స్థానికంగా ఉపాధిని కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో వసతులను అభివృద్ధి చేసేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రహదారులు, ఫాంపాండ్, ప్లాంటేషన్, నర్సరీ, ఇంకుడు గుంతలు, ఫారెస్ట్ స్ట్రంచేస్ తదితర ఎంఎన్ఆర్ఇజిఎస్ పథకంలో చూయించిన అన్ని పనులను పూర్తిచేసి టార్గెట్ ప్రకారం గ్రామ పంచాయతీల వారీగా ఉపాధి హామీ కూలీలకు పని దినాలు కల్పించాలని అన్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ, అంగన్వాడి భవనాలు ఇతర నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. ఇంకా నిర్మాణం చేపట్టని వాటిని వెంటనే నిర్మాణం చేపట్టాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు పేమెంట్ త్వరగా వచ్చేలా చూడాలని అన్నారు. అన్ని మండలాల్లో టెక్నికల్ అసిస్టెంట్ల సేవలు వినియోగించుకునేలా రెండు రోజులలో టెక్నికల్ అసిస్టెంట్లను అన్ని మండలాలలో అడ్జస్ట్ చేస్తామని అన్నారు. గ్రామాల వారీగా ఉపాధి హామీ కూలీలకు నిర్దేశించిన లక్ష్యం మేరకు కచ్చితంగా పని దినాలు కల్పించాలని విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పనిచేయాలనే ఉద్దేశం ఉన్నవారే ఎన్ఆర్ఇజిఎస్ సిస్టం లో ఉండాలని అన్నారు. పనిచేయడానికి ఇష్టం లేనివారు వెళ్ళిపోవచ్చు అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ జయదేవ్ ఆర్యా, జెడ్పి సీఈఓ రమేష్, డీపీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *