Breaking News

నేరాల నియంత్రణకే సీసీ కెమెరాలు…

122 Views

నేరాల నియంత్రణ, కేసులు ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్రపోషిస్తాయి అని:జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే తెలిపారు

వీర్నపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్జనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన 06 సీసీ కెమెరాలను ఈ రోజు ప్రజాప్రదినిధులతో గ్రామస్తులతో కలసి ప్రారంభించిన జిల్లా ఎస్పీ…

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ….
అన్ని గ్రామాల ప్రజలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వచ్చి గ్రామంలో విధిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.సిసి కెమెరాల ఏర్పాటు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో నేరాలను అదుపు చేయవచ్చని, దొంగతనాలు నివారించే అవకాశం ఏర్పడుతుందని, ఒకవేళ దొంగతనం జరిగినా సిసి కెమెరాల ద్వారా వారిని గుర్తించి పెట్టుకోవచ్చని చెప్పారు.

టి ఫైబర్ ద్వారా కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మరియు అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సీసీ కెమెరాలను జిల్లా పోలీస్ కార్యక్రమంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానం చేయడం జరుగుతుంది దీని ద్వారా ఎక్కడైనా ట్రాఫిక్ వాయిలెన్స్ చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుండే జరిమానాలు విధించడం, ఏదయినా గ్రామం లో, పట్టణంలో L&O, ట్రాఫిక్ సమస్య తలెత్తిన,వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించడం ద్వారా సమస్య ను పరిష్కరించడం జరుగుతుందని అని అన్నారు..అదేవిధంగా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అన్నారు..వీర్నపల్లి మండల పరిధిలో అన్ని గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు…

*రాధారపు సత్యం తన కూతురు మేఘన పుట్టినరోజు సందర్భంగా గర్జనపల్లి గ్రామంలో 6 సీసీ కెమెరాల ఏర్పాటు చేసినందుకు జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి తన కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలుతెలియజేశారు..*

ఈ కార్యక్రమంలో డిఎస్పీ చంద్రశేఖర్, తోట ఆగయ్య,సి.ఐ మోగిలి,ఎస్.ఐ గారు,సర్పంచ్ కరుణరంజిత్, వీర్నపల్లి జెడ్పిటిసి కళావతి, ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి లక్ష్మణ్ రావు, ఉప సర్పంచ్ రామస్వామి, వైస్ ఎంపీపీ హేమ, రైతుబంధు అధ్యక్షులు ఎడ్ల సాగర్,కొండ రమేష్, కృష్ణారెడ్డి, రాధారపు సత్యం, చిదుగు గోవర్ధన్,గ్రామస్తులు పాల్గొన్నారు..

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7