ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి19, భారతీయ జనతాపార్టీ కనమేని చక్రధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు తెర్లుమద్ది క్రాసింగ్ నుండి 500కు పైచిలుకు బైక్ ర్యాలీ నిర్వహించారు. శనివారం రోజున అకాలవర్షం దాటికి నష్టపోయిన మండలంలోని ముస్తాబాద్ నామాపూర్, గూడెం, కొండాపూర్, ఆవునూర్ గ్రామాలతో పాటు పలుగ్రామాలలో సందర్శించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సిరిసిల్ల నియోజకవర్గం ప్రాతినిథ్యం వహిస్తున్నటువంటి మంత్రి కేటీఆర్ రైతులకు వరి పంట నష్టపోయిన రైతులకు తక్షణ సహాయంగా నష్టపరిహారం చెల్లించాలని ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ఉన్నప్పుడు రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించేవారని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతుబంధు పేరుతో ఎత్తివేశారు రైతులు దీన పరిస్థితిని అర్థం చేసుకొని ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని రైతుల రుణమాఫీని తక్షణమే చేయాలని గూడెం గ్రామానికి చెందిన గొప్ప అంజయ్యతో పాటు పలువురు రైతులు మంజూరు చేయాలన్నారని కనమేని చక్రధర్ రెడ్డి తెలిపారు. ఈకార్యక్రమంలో కరెడ్ల మల్లారెడ్డి, సంతోష్ రెడ్డి, అంజ గౌడ్, బాద నరేష్, పప్పుల శ్రీకాంత్, ఉపేందర్ గౌడ్, ఓరగంటి సత్యం, రామ్ గోపాల్, బండి శ్రీకాంత్, బిజెపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
