*ప్రభుత్వ కళాశాలలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి*
*పలు కళాశాలలో కమిటీలు & మెంబెర్స్షిప్ చెయ్యడం జరిగిందన్నారు.*
*ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు*
మద్దూరు: మండలంలోని ప్రభుత్వ కళాశాలలో అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కళాశాల, మోడల్ పాఠశాలలో కమిటీలు గురువారం నాడు వేయ్యడం జరిగిందని తదనంతరం మధ్యాహ్న భోజనం ఏర్పాటుచెయ్యాలని ప్రభుత్వాన్ని జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా పుల్లని వేణు మాట్లాడుతూ… విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు తీరు ఇప్పటికైనా మార్చుకోవాలని, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ద్రుష్టి పెట్టాల్సిన ప్రభుత్వం వైన్స్ లపై దృష్టి పెట్టి విద్యార్థుల భవిష్యత్తులతో చెలగాటం ఆడుతున్నాయని, ఇప్పడికైనా ఈ ప్రభుత్వాలు వారి వైఖరిని మార్చుకోని విద్యార్థుల సమస్యలపై దృష్టి పెట్టి సమస్యల సాధనకోసం కృషి చేయాలని కోరారు. విద్యార్థులకు ఓటు హక్కు లేదని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఓటు హక్కు వున్నా వారికే ప్రాధాన్యత ఇస్తున్న ఈ ప్రభుత్వాలను గద్దె దింపేస్తామని హెచ్చరించారు. లేనిపక్షంలో విద్యార్థులను ఏకం చేసి ప్రభుత్వ కార్యాలయలను ముట్టడిస్తామని హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.ఎస్.బి జిల్లా నాయకులు ఆత్మకూరి హరికృష్ణ,మద్దూర్ మండల అధ్యక్షులు వెల్దీ సాయికుమార్ రెడ్డి, శవాళ్ళ సంతోష్, సాయితేజ,భాస్కర్ , శ్రీధర్, సందీప్, అరుణ్, జశ్వంత్ మరియు తదితర విద్యార్థులు పాల్గొన్నారు.





