ప్రాంతీయం

రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంజెపి విద్యార్థులు ఎంపిక

110 Views

దౌల్తాబాద్ : మహాత్మా జ్యోతిబాపూలే విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల సిద్దిపేటలో జరిగిన ఎంపిక పోటీల్లో అండర్ 16 విభాగంలో మూడు వేల మీటర్ల పరుగు పందెంలో పదో తరగతి విద్యార్థి నందేష్, అండర్ 18 విభాగంలో మూడు వేల మీటర్ల పరుగు పందెంలో ఇంటర్మీడియట్ విద్యార్థి సంతోష్ ప్రథమ స్థానంలో నిలిచారు. వీరిని ఎంపిక కమిటీ రాష్ట్రస్థాయికి ఎంపిక చేసింది. వీరిద్దరూ హైదరాబాదులోని గోల్కొండ మైదానంలో ఈనెల 20న జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో సిద్దిపేట జిల్లా తరఫున పాల్గొననున్నారని పీడీ వెంకట్‌రెడ్డి తెలిపారు. అథ్లెటిక్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రిన్సిపాల్ శోభారాణి, ఉపాధ్యాయులు అభినందించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *